Year-Wise Tracking Active

సుకన్య సమృద్ధి యోజన (SSY) Calculator

By Degala Raviteja
6+ years industry exp | MBA Finance | CEH Certified
Updated: August 2026

మీ పాప భవిష్యత్తుకు భరోసా. మీరు సంవత్సరానికి ఎంత కడతారో టైప్ చేసి... మెచ్యూరిటీ మొత్తం, పన్ను లేని వడ్డీ లాభాలు మరియు 21 సంవత్సరాల జర్నీని కచ్చితంగా లెక్కించండి.

పెట్టుబడి వివరాలు

మీరు ప్రతి నెలా ఒకేలా కట్టాల్సిన అవసరం లేదు. (ఉదా: ఒక నెల 2 వేలు, మరో నెల 3 వేలు). సంవత్సరానికి గరిష్ట పన్ను మినహాయింపు పరిమితి ₹1.5 లక్షలు.

₹
Yrs
%

ప్రభుత్వం చేత

ఆశించిన మెచ్యూరిటీ మొత్తం

₹0

100% పన్ను మినహాయింపు (EEE Status)

పెట్టిన పెట్టుబడి (15 సం||)

₹0

వచ్చిన మొత్తం వడ్డీ లాభం

₹0

పోర్ట్‌ఫోలియో వృద్ధి శాతం

21-సంవత్సరాల జర్నీ మ్యాప్

పెట్టుబడి దశ ముగింపు
Year 2040
పూర్తి మెచ్యూరిటీ (డబ్బు వచ్చేది)
సంవత్సరం 2046 (పాప వయస్సు 22)

సుకన్య సమృద్ధి యోజన: ముఖ్యమైన నియమాలు

15 సం|| కట్టాలి, 21 సం|| కి వస్తుంది

చాలామంది తల్లిదండ్రులకు ఉండే సందేహం ఇదే. మీరు డబ్బు కేవలం మొదటి 15 సంవత్సరాలు మాత్రమే కట్టాలి. ఆ తర్వాత 16వ సంవత్సరం నుండి 21వ సంవత్సరం వరకు మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ సమయంలో కూడా మీ ఖాతాలోని మొత్తంపై చక్రవడ్డీ జతచేయబడుతూనే ఉంటుంది. ఖాతా తెరిచిన తేదీ నుండి సరిగ్గా 21 సంవత్సరాలకు పూర్తి మెచ్యూరిటీ అమౌంట్ అందుతుంది.

ఎటువంటి పన్ను ఉండదు (EEE Tax)

సుకన్య సమృద్ధి యోజన అత్యంత ఆకర్షణీయంగా ఉండటానికి కారణం దీనికున్న EEE (Exempt-Exempt-Exempt) పన్ను మినహాయింపు హోదా. మీరు కట్టే డబ్బు (₹1.5L వరకు) సెక్షన్ 80C కింద మినహాయింపు పొందుతుంది. ప్రతి సంవత్సరం వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను ఉండదు. చివరగా 21 సంవత్సరాల తర్వాత మీరు తీసుకునే భారీ మెచ్యూరిటీ మొత్తం కూడా పూర్తిగా 100% పన్ను రహితం.

తల్లిదండ్రులు తరచుగా అడిగే ప్రశ్నలు

ప్రతి నెలా వేర్వేరు మొత్తాలు కట్టవచ్చా? (ఉదాహరణకు ఈ నెల 2 వేలు, వచ్చే నెల 5 వేలు)
కచ్చితంగా కట్టవచ్చు. SSY ఖాతాలలో చాలా వెసులుబాటు ఉంటుంది. మీరు కచ్చితమైన ఫిక్స్‌డ్ మంత్లీ SIP పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ నెల ₹2,000 కట్టి, వచ్చే నెల మానేసి, ఆ పై నెల ₹10,000 కట్టవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో (Financial Year) మీరు కట్టే మొత్తం కనిష్టంగా ₹250, గరిష్టంగా ₹1,50,000 మధ్య ఉంటే సరిపోతుంది.
బ్యాంకుల్లో కట్టేదానికి, పోస్ట్ ఆఫీస్‌లో కట్టేదానికి వడ్డీ తేడా ఉంటుందా?
ఎలాంటి తేడా ఉండదు. SSY వడ్డీ రేటును (ప్రస్తుతం 8.2%) భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్‌లో ఖాతా తెరిచినా, లేదా SBI, HDFC వంటి మరే ఇతర అధీకృత బ్యాంకులో తెరిచినా... వడ్డీ రేటు, మెచ్యూరిటీ మరియు నియమాలు అన్నీ ఒకేలా ఉంటాయి.
పాప ఉన్నత చదువుల కోసం 21 సంవత్సరాల కంటే ముందే డబ్బు తీసుకోవచ్చా?
అవును, తీసుకోవచ్చు. పాపకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 10వ తరగతి పాస్ అయిన తర్వాత, ఉన్నత చదువుల నిమిత్తం... అప్పటివరకు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌లో గరిష్టంగా 50% వరకు వెనక్కి తీసుకోవడానికి (Partial Withdrawal) అనుమతి ఉంది.