Financial Safety Net

ఎమర్జెన్సీ ఫండ్ Calculator

By Degala Raviteja
6+ years industry exp | MBA Finance | CEH Certified
Updated: August 2026

ఈరోజే మీ ఉద్యోగం పోతే, మీరు ఎన్ని నెలలు నెట్టుకురాగలరు? కేవలం అంచనా వేయకండి. 3-6-9 రూల్ ప్రకారం మీ కచ్చితమైన "సర్వైవల్ నంబర్" (Survival Number) లెక్కించండి మరియు ఆ గ్యాప్‌ను పూడ్చడానికి ఎన్ని నెలలు పడుతుందో కచ్చితంగా తెలుసుకోండి.

నెలవారీ ఖర్చులు & బాధ్యతలు

అద్దె, కిరాణా, కరెంట్ బిల్లు, పెట్రోల్ మొ|| (EMIలు కాకుండా)

₹

హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ మొ||

₹

హెల్త్ / లైఫ్ (సంవత్సరానికి)

₹
6 నెలలు

3-6-9 రూల్ ప్రకారం ఎంచుకోండి

3 Mo (Base) 6 Mo (Safe) 9+ (Pro)

మీ గ్యాప్ మరియు సమయాన్ని లెక్కించండి

₹
₹

ఎమర్జెన్సీ ఫండ్ కోసం నెలకు ఎంత దాచగలరు?

Standard 6-Month Plan

లక్ష్యంగా పెట్టుకోవాల్సిన ఎమర్జెన్సీ ఫండ్

₹0

మొత్తం ఇంటి ఖర్చులు ₹0
మొత్తం EMI అప్పులు ₹0
1-సంవత్సరం ఇన్సూరెన్స్ ₹0
ఇప్పటికే పొదుపు చేసినది ₹0
ఇంకా దాచుకోవాల్సిన మొత్తం (Gap) ₹0

గ్యాప్‌ను పూడ్చడానికి పట్టే సమయం

మీ నెలవారీ సేవింగ్స్ ఆధారంగా

0 నెలలు

ఎమర్జెన్సీ ఫండ్ ప్రోగ్రెస్

0%

📐 ఎమర్జెన్సీ ఫండ్ కోసం 3-6-9 రూల్ అంటే ఏమిటి?

అందరికీ ఒకే విధమైన సేఫ్టీ నెట్ అవసరం లేదు. మీ ఉద్యోగ భద్రత ఆధారంగా ఫైనాన్షియల్ అడ్వైజర్లు 3-6-9 రూల్ సూచిస్తారు:

  • 3 నెలలు: ఎలాంటి అప్పులు లేకుండా, అత్యంత స్థిరమైన ప్రభుత్వ లేదా కార్పొరేట్ ఉద్యోగం ఉన్న బ్యాచిలర్స్ కోసం.
  • 6 నెలలు: ఇది స్టాండర్డ్ ప్లాన్. మీరు ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్నా, మీకు EMI లు ఉన్నా, లేదా మీపై ఆధారపడిన కుటుంబం ఉన్నా ఇది తప్పనిసరి.
  • 9-12 నెలలు: ఫ్రీలాన్సర్లు, వ్యాపారస్తులు మరియు ఒకే ఆదాయంపై ఆధారపడే కుటుంబాల కోసం.

🏦 ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ దాచుకోవాలి?

  • ✅ 30% సేవింగ్స్ అకౌంట్‌లో: మెడికల్ ఎమర్జెన్సీ కోసం రాత్రి సమయంలో కూడా ATM లేదా UPI ద్వారా వెంటనే తీసుకునేలా ఉండాలి.
  • ✅ 70% లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా FD లలో: పెనాల్టీ లేకుండా మెరుగైన వడ్డీని ఇచ్చే Sweep-in FD లను ఉపయోగించండి.
  • ❌ 0% ఈక్విటీ (స్టాక్స్) లో: స్టాక్ మార్కెట్ చాలా రిస్క్. మీ ఉద్యోగం పోయిన అదే సమయంలో మార్కెట్ క్రాష్ అయితే, మీ సేఫ్టీ నెట్ కనుమరుగవుతుంది.

ఆర్థిక భద్రత: తరచుగా అడిగే ప్రశ్నలు

ఎమర్జెన్సీ ఫండ్‌ను ఎలా లెక్కించాలి?
మీ ఎమర్జెన్సీ ఫండ్‌ను లెక్కించడానికి, ముందుగా మీ నెలవారీ ఇంటి ఖర్చులు (అద్దె, కిరాణా, కరెంట్ బిల్లులు) మరియు తప్పనిసరి EMI లను (లోన్స్) కలపండి. ఈ మొత్తం నెలకు ఎంత అవుతుందో దాన్ని 6 నెలల (3-6-9 రూల్ ఆధారంగా) పాటు గుణించండి. చివరగా, మీ ఉద్యోగం పోయినా పాలసీ రద్దు కాకుండా ఉండటానికి మీ వార్షిక హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను దానికి జత చేయండి.
దీనికోసం ఎమర్జెన్సీ ఫండ్ క్యాలిక్యులేటర్ Excel వాడవచ్చా?
వాడవచ్చు, Excel లో =(నెలవారీ ఖర్చులు + EMI) * నెలలు అనే ఫార్ములా వేసి లెక్కించవచ్చు. కానీ FinKinetic లాంటి వెబ్ టూల్స్ వల్ల మీకు కచ్చితమైన "గ్యాప్" ఎంత ఉందో, మరియు మీరు నెలకు ఎంత దాచుకుంటే ఆ లక్ష్యాన్ని ఎన్ని నెలల్లో చేరుకోగలరో క్షణాల్లో తెలుస్తుంది.
సర్వైవల్ నంబర్‌కు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎందుకు కలపాలి?
చాలామందికి కంపెనీ నుండే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం పోతే ఆ ఇన్సూరెన్స్ వెంటనే క్యాన్సిల్ అవుతుంది. అలాంటి సమయంలో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మీ జీవితకాల సంపాదన అంతా ఖర్చవుతుంది. కాబట్టి మీ పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీలు రద్దు కాకుండా కట్టుకోవడానికి ఈ 1-సంవత్సరపు బఫర్ అమౌంట్ చాలా ముఖ్యం.