⚡ సారాంశం: ITR-1 మీరే సొంతంగా ఫైల్ చేయండి

చాలా మంది ఉద్యోగులు "నా జీతం నుండి కంపెనీ వాళ్ళు TDS కట్ చేశారు కదా, ఇక నేను ఇన్‌కమ్ టాక్స్ ఫైల్ చేయాల్సిన పనిలేదు" అని అనుకుంటారు. ఇది తప్పు. TDS అనేది కేవలం అడ్వాన్స్ టాక్స్ మాత్రమే. మీరు ప్రభుత్వానికి మీ ఆదాయం ఎంత అని అధికారికంగా చెప్పడానికి, మరియు ముఖ్యంగా ఎక్కువ కట్ అయిన టాక్స్ వెనక్కి (Refund) పొందడానికి కచ్చితంగా ITR (Income Tax Return) ఫైల్ చేయాలి.

ITR-1 (సహజ్) అనేది జీతం తీసుకునేవారు, పెన్షనర్లు మరియు ₹50 లక్షల లోపు ఆదాయం ఉన్న వారి కోసం రూపొందించిన సులభమైన ఫారం. ఇప్పుడు కొత్త ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్‌లో "Pre-filled Return" సదుపాయం ఉంది. అంటే, మీ Form-16 వివరాలు, బ్యాంకు వడ్డీ వివరాలు అన్నీ ఆటోమేటిక్ గా నింపబడి ఉంటాయి. మీరు కేవలం వాటిని సరిచూసుకుని (Validate) సబ్మిట్ చేస్తే చాలు. మొత్తం ప్రాసెస్ 15 నిమిషాల్లో అయిపోతుంది.

కేవలం టాక్స్ కోసమే కాకుండా, భవిష్యత్తులో మీరు హోమ్ లోన్ తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డ్ కావాలన్నా, లేదా విదేశాలకు వెళ్లడానికి వీసా కావాలన్నా ITR రసీదు తప్పనిసరి. సాధారణంగా గడువు తేదీ జూలై 31 ఉంటుంది. ఆ లోపు చేయకపోతే ₹5,000 వరకు జరిమానా పడుతుంది. ఈ గైడ్ ద్వారా మీరు CA సహాయం లేకుండానే మీ రిటర్న్ ఫైల్ చేయడం నేర్చుకోవచ్చు.

CA ఫీజు ఆదా 15 నిమిషాల పని

ITR Filing: ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలి? (స్టెప్-బై-స్టెప్) - ఉద్యోగులు ITR-1 (సహజ్) Free ఆన్‌లైన్‌.

By Degala Raviteja
6+ years industry exp | MBA Finance | CEH Certified
Updated: August 2026

ట్యాక్స్ ఫైలింగ్ అంటే భయం వద్దు. కొత్త e-Filing పోర్టల్‌లో మీ జీతం, వడ్డీ, TDS వంటి 80% వివరాలు ముందే నింపబడి ఉంటాయి. మీరు కేవలం సరిచూసుకుని సబ్మిట్ చేస్తే చాలు. ఈ గైడ్ ద్వారా మీరే సులభంగా ITR ఫైల్ చేయండి.

Verified: Income Tax Dept Rules
Updated: AY 2025-26

ITR-1 (సహజ్) ఎవరు ఫైల్ చేయకూడదు? (ముఖ్యమైన చెక్-లిస్ట్)

ఆదాయ వనరు / పరిస్థితి ITR-1 ఫైల్ చేయవచ్చా? ఏ ఫారం వాడాలి?
స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో లాభాలు (Capital Gains) వస్తే ❌ కూడదు ITR-2 వాడాలి
ఫ్రీలాన్సింగ్, యూట్యూబ్ లేదా వ్యాపారం ద్వారా ఆదాయం ఉంటే ❌ కూడదు ITR-4 (లేదా ITR-3) వాడాలి. GST ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకోండి.
ఒకరి కంటే ఎక్కువ ఇళ్లపై (House Properties) అద్దె ఆదాయం వస్తే ❌ కూడదు ITR-2 వాడాలి
క్రిప్టోకరెన్సీ (Virtual Digital Assets) ద్వారా ఆదాయం ఉంటే ❌ కూడదు ITR-2 వాడాలి
కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నా, లేదా అన్‌లిస్టెడ్ షేర్లు ఉన్నా ❌ కూడదు ITR-2 లేదా ITR-3

హెచ్చరిక: "AIS" మర్చిపోవద్దు

కొత్తగా ఫైల్ చేసేవారు చేసే పెద్ద తప్పు: పోర్టల్‌లో ఉన్న వివరాలు గుడ్డిగా నమ్మడం.

ముందు AIS చెక్ చేయండి: మీరు షేర్లు అమ్మినా, ఫిక్సెడ్ డిపాజిట్ వడ్డీ వచ్చినా, క్రెడిట్ కార్డు బిల్లు లక్ష దాటినా ప్రభుత్వం AIS (Annual Information Statement) లో రికార్డ్ చేస్తుంది. ఆ ఆదాయం మీరు ITR లో చూపించకపోతే, వెంటనే నోటీసు వస్తుంది.

ఏ రెజీమ్ (Regime) బెటర్?

పోర్టల్ ఆటోమేటిక్ గా "New Regime" చూపిస్తుంది. మీరు మార్చుకోవాలా?

New Regime తక్కువ టాక్స్ రేట్లు • డిడక్షన్స్ (HRA/80C) ఉండవు
Old Regime ఎక్కువ టాక్స్ రేట్లు • HRA, 80C, లోన్ క్లెయిమ్ చేయవచ్చు

తీర్పు: మీకు HRA, 80C, 80D అన్నీ కలిపి ₹3.75 లక్షల కంటే ఎక్కువ ఉంటే Old Regime ఎంచుకోండి. లేదంటే New Regime బెటర్.

జూలై 31 డెడ్‌లైన్ మర్చిపోవద్దు!

గడువు దాటితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి:

మొత్తం వార్షిక ఆదాయం (Gross Income) లేట్ ఫీజు (సెక్షన్ 234F) అదనపు వడ్డీ (సెక్షన్ 234A)
₹2.5 లక్షల లోపు (పన్ను పరిమితి దాటకపోతే) సున్నా (₹0) వడ్డీ పడదు
₹2.5 లక్షల నుండి ₹5 లక్షల వరకు ₹1,000 కట్టాల్సిన పన్నుపై నెలకు 1% వడ్డీ
₹5 లక్షలకు పైన ఎంత ఉన్నా ₹5,000 కట్టాల్సిన పన్నుపై నెలకు 1% వడ్డీ

కావలసిన డాక్యుమెంట్స్

  • ✅ ఫారం 16: మీ కంపెనీ ఇచ్చే Form 16 (Part A & B).
  • ✅ బ్యాంక్ స్టేట్‌మెంట్: వడ్డీ ఆదాయం తెలుసుకోవడానికి.
  • ✅ Form 26AS / AIS: ట్యాక్స్ పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి.

సిద్ధంగా ఉన్నారా?

మీ ఆదాయం ₹50 లక్షల లోపు ఉండి, జీతం, ఇంటి అద్దె లేదా వడ్డీ ద్వారా మాత్రమే ఆదాయం వస్తుంటే మీరు ITR-1 (సహజ్) ఫైల్ చేయవచ్చు. మీరు దీనికి అర్హులైతే, CA అవసరం లేదు. పదండి మొదలుపెడదాం.

ముఖ్య గమనిక: AY మరియు FY మధ్య తేడా

చాలా మంది ఇక్కడే సంవత్సరం తప్పుగా ఎంచుకుంటారు.

FY (Financial Year) మీరు డబ్బు సంపాదించిన సంవత్సరం.
ఉదాహరణ: ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 .
ఇది ఎంచుకోండి
AY (Assessment Year) మీరు రిటర్న్ ఫైల్ చేసే సంవత్సరం.
ఉదాహరణ: AY 2025-26 .

1 స్టెప్ 1: లాగిన్ & ఫారం ఎంపిక

  1. 1

    లాగిన్ (Login)

    incometax.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి. లాగిన్ క్లిక్ చేయండి. మీ User ID మీ పాన్ నంబర్ .

  2. 2

    File Income Tax Return

    డాష్‌బోర్డ్‌లో File now క్లిక్ చేయండి.
    Assessment Year: 2025-26 (Current) ఎంచుకోండి.
    Mode of Filing: Online .

  3. 3

    ITR రకం ఎంచుకోండి

    Status: Individual .
    ITR Type: ITR-1 (Sahaj) .
    "Proceed with ITR-1" క్లిక్ చేయండి.

2 స్టెప్ 2: వ్యక్తిగత వివరాలు & టాక్స్ విధానం (Regime)

మీ పేరు, పాన్, ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి.

ముఖ్యం: "Filing Section" దగ్గర 139(1) - Return filed on or before due date ఎంచుకోండి.

New vs Old Regime: మీకు ఒక ప్రశ్న కనిపిస్తుంది: "Do you wish to exercise the option u/s 115BAC(6)?" .

  • No (డీఫాల్ట్): మీరు New Regime (తక్కువ పన్ను, డిడక్షన్స్ ఉండవు) లో ఉండాలంటే ఇది ఎంచుకోండి.
  • Yes : మీరు Old Regime (ఎక్కువ పన్ను, కానీ 80C/HRA క్లెయిమ్ చేయవచ్చు) కావాలంటే ఇది ఎంచుకోండి.

Old vs New Regime: ఏది బెటర్?

ఫీచర్ New Regime (Default) Old Regime
పన్ను రేట్లు తక్కువ ఎక్కువ
80C (LIC/PPF) వర్తించదు వర్తిస్తుంది (1.5L వరకు)
HRA / LTA వర్తించదు వర్తిస్తుంది
Standard Deduction వర్తిస్తుంది వర్తిస్తుంది

3 స్టెప్ 3: మొత్తం ఆదాయం (Gross Total Income)

ఈ సెక్షన్‌లో మీ Form 16 మరియు AIS నుండి డేటా ఆటోమేటిక్‌గా వస్తుంది. దాన్ని జాగ్రత్తగా సరిచూసుకోండి.

A. జీతం నుండి ఆదాయం (Income from Salary)

"Gross Salary" చెక్ చేయండి. ఇది మీ Form 16 లోని Part B తో మ్యాచ్ అవ్వాలి.
గమనిక: Standard Deduction (₹50,000 లేదా ₹75,000) ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.

B. ఇంటి ఆస్తి నుండి ఆదాయం (House Property)

మీకు హోమ్ లోన్ ఉంటే, మీరు కట్టిన వడ్డీని ఇక్కడ నెగటివ్ వాల్యూ (Negative Value) గా ఎంటర్ చేయండి (ఉదా: -2,00,000). ఇది Old Regime లో మాత్రమే పనిచేస్తుంది.

C. ఇతర వనరుల నుండి ఆదాయం (Other Sources)

ఇందులో బ్యాంక్ వడ్డీ మరియు FD వడ్డీ ఆటోమేటిక్‌గా వస్తాయి. దీన్ని డిలీట్ చేయకండి! డిపార్ట్‌మెంట్‌కు ఈ వివరాలు AIS ద్వారా తెలుస్తాయి.

4 స్టెప్ 4: పన్ను చెల్లింపు & వెరిఫికేషన్

  • 📄
    TDS వెరిఫికేషన్: "Taxes Paid" ట్యాబ్‌లో, మీ కంపెనీ మరియు బ్యాంకులు కట్ చేసిన TDS సరిగ్గా ఉందో లేదో Form 26AS తో పోల్చి చూసుకోండి.
  • 💰
    రీఫండ్ లేదా పన్ను? మీరు ఇంకా పన్ను కట్టాలా లేదా మీకు రీఫండ్ వస్తుందా అని సిస్టమ్ చూపిస్తుంది. రీఫండ్ ఉంటే, మీ బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి.
  • ✅
    e-Verification (తప్పనిసరి): సబ్మిట్ చేసిన తర్వాత, "e-Verify Now" క్లిక్ చేయండి. "Aadhaar OTP" ఎంచుకుని వెరిఫై చేయండి. మీరు e-Verify చేస్తేనే మీ ఫైలింగ్ పూర్తవుతుంది.

ITR ఫైల్ చేసేటప్పుడు అందరూ చేసే 3 కామన్ తప్పులు (వీటిని నివారించండి)

  • 🏦
    పాత బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం:

    రీఫండ్ రావాలంటే మీరు ఇచ్చిన బ్యాంక్ ఖాతా పోర్టల్‌లో కచ్చితంగా "Pre-validated" అయి ఉండాలి. మూతపడిన ఖాతాలు ఇస్తే మీ రీఫండ్ ఆగిపోతుంది.

  • 📊
    AIS (Annual Information Statement) చెక్ చేయకపోవడం:

    మీ Form 16 లో కేవలం జీతం వివరాలు మాత్రమే ఉంటాయి. కానీ మీరు చేసిన ఫిక్సెడ్ డిపాజిట్ల (FD) వడ్డీ, సేవింగ్స్ ఖాతా వడ్డీ అన్నీ AIS లో రికార్డ్ అవుతాయి. వాటిని ITR లో చూపించకపోతే 100% నోటీసు వస్తుంది.

  • ✅
    e-Verify మర్చిపోవడం:

    ఫారం అంతా ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన తర్వాత, ఆధార్ OTP ద్వారా ఈ-వెరిఫై (e-Verify) చేయకపోతే, మీరు అసలు ITR ఫైల్ చేయనట్లే లెక్క. సబ్మిట్ చేసిన 30 రోజుల్లోపు వెరిఫై చేయడం తప్పనిసరి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

రీఫండ్ రావడానికి ఎంత సమయం పడుతుంది?

మీరు ఆధార్ OTP ద్వారా వెంటనే వెరిఫై చేస్తే, సాధారణంగా 10 నుండి 30 రోజుల్లో రీఫండ్ వస్తుంది. మీ బ్యాంక్ ఖాతా పోర్టల్‌లో "Validated" అని ఉండాలి.

నేను తప్పు చేశాను. మార్చవచ్చా?

అవును. డిసెంబర్ 31 లోపు మీరు Revised Return (u/s 139(5)) ఫైల్ చేసి తప్పులు సరిదిద్దుకోవచ్చు. దీనికి పెనాల్టీ ఉండదు.

ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉంటే ఫైల్ చేయాలా?

మీ ఆదాయం ₹2.5 లక్షలు (లేదా కొత్త విధానంలో ₹3 లక్షలు) దాటితే ఫైల్ చేయడం తప్పనిసరి. అంతకంటే తక్కువ ఉన్నా "Nil Return" ఫైల్ చేయడం వల్ల లోన్ లేదా వీసా అప్లికేషన్లకు ఉపయోగపడుతుంది.