⚡ తెలుగు సారాంశం (Summary)

UAN యాక్టివేట్ చేసుకోవడానికి మీరు PF ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అధికారిక EPFO పోర్టల్ లో మీ ఆధార్ మరియు మొబైల్ నంబర్ ఉపయోగించి 2 నిమిషాల్లో యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పాస్‌వర్డ్ మీ ఫోన్‌కు SMS ద్వారా వస్తుంది.

కొత్తవారికి (First Time) 5 నిమిషాల పని

UAN ఆక్టివేషన్ ప్రాసెస్ (పాస్వర్డ్ జనరేట్ చేయడం ఎలా?)

By Degala Raviteja
6+ years industry exp | MBA Finance | CEH Certified
Updated: August 2026

మీ PF బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా, డబ్బు విత్‌డ్రా చేయాలన్నా మీ UAN (Universal Account Number) ఖచ్చితంగా Active గా ఉండాలి. మీరు కొత్తగా ఉద్యోగంలో చేరినట్లయితే, పాస్‌వర్డ్ సృష్టించుకోవడానికి ఈ ప్రాసెస్ తప్పనిసరి.

Verified: EPFO Portal
Updated: Jan 2026

EPF స్కామ్ అలర్ట్

మీకు ఎవరైనా కాల్ చేసి "మీ PF వడ్డీ పెండింగ్ ఉంది, OTP చెప్పండి" అని అడిగారా?

జాగ్రత్త! OTP ఎవరికీ చెప్పకండి. EPFO ఎప్పుడూ సభ్యులకు కాల్ చేయదు. స్కామర్లు మీ పెన్షన్ డబ్బు కాజేయడానికి ఇలా చేస్తారు.

లాభం ఏంటి? (8.25% వడ్డీ)

UAN యాక్టివేట్ చేస్తేనే మీ కంపెనీ డబ్బులు కడుతుందో లేదో తెలుస్తుంది. మీ PF డబ్బుపై 8.25% వడ్డీ వస్తుంది. ఇది బ్యాంక్ FD కంటే చాలా ఎక్కువ.

ఉదాహరణకు మీ బ్యాలెన్స్: ₹1,00,000
సంవత్సరానికి వచ్చే వడ్డీ: + ₹8,250

"Details Not Matching" ఎర్రర్ వస్తోందా?

చాలా మంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. దీనికి కారణం:

కావలసిన వివరాలు

మీ దగ్గర ఇవి ఉంచుకోండి:

  • ✅ UAN నంబర్: 12 అంకెల నంబర్ (మీ జీతం స్లిప్‌లో ఉంటుంది).
  • ✅ ఆధార్ నంబర్: మొబైల్ లింక్ అయి ఉండాలి.
  • ✅ మొబైల్: OTP పొందడానికి.

UAN నంబర్ తెలియదా?

అదే వెబ్‌సైట్‌లో మీరు తెలుసుకోవచ్చు:

1. Unified Member Portal కి వెళ్ళండి.

2. "Know your UAN" పై క్లిక్ చేయండి.

3. మొబైల్ నంబర్ ఇచ్చి OTP ఎంటర్ చేయండి.

4. పేరు + పుట్టిన తేదీ + ఆధార్ ఎంటర్ చేయండి.

5. మీ UAN మీకు SMS ద్వారా వస్తుంది.

ప్రో టిప్: UAN ముందే ఆక్టివేట్ అయిందో లేదో చెక్ చేయడం ఎలా?

చాలా మందికి తమ పాత కంపెనీలోనే UAN ఆక్టివేట్ అయి ఉంటుంది, కానీ వారు కొత్తగా మళ్ళీ ఆక్టివేట్ చేయడానికి ప్రయత్నించి ఎర్రర్స్ చూసి కంగారు పడతారు. మీరు ప్రాసెస్ మొదలుపెట్టే ముందు ఈ సింపుల్ ట్రిక్ ద్వారా మీ UAN స్టేటస్ చెక్ చేసుకోండి:

  • 1 మెంబర్ లాగిన్ పోర్టల్‌కి వెళ్లి "Forgot Password" ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • 2 మీ 12 అంకెల UAN నంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేయండి.
✅

ఫలితం: సిస్టమ్ మీ ఫోన్ నంబర్ చూపిస్తూ OTP అడిగితే.. మీ UAN ముందే ఆక్టివేట్ అయి ఉందని అర్థం! మీరు ఈ యాక్టివేషన్ ప్రాసెస్ చేయాల్సిన పనిలేదు, నేరుగా కొత్త పాస్‌వర్డ్ సెట్ చేసుకుని లాగిన్ అవ్వొచ్చు.

UAN యాక్టివేట్ చేసుకోవడానికి ఉన్న 3 ప్రధాన మార్గాలు

యాక్టివేషన్ పద్ధతి విధానం / కాంటాక్ట్ వివరాలు ఎవరికి ఉపయోగం?
ఆన్‌లైన్ పోర్టల్ (Online) Unified Portal కి వెళ్లి 'Activate UAN' క్లిక్ చేయడం ఇంటర్నెట్ మరియు ఆధార్ OTP ఉన్నవారికి బెస్ట్
SMS ద్వారా (Offline) EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 కి మెసేజ్ పంపండి కీప్యాడ్ ఫోన్ వాడేవారికి మరియు ఇంటర్నెట్ లేనివారికి
మిస్డ్ కాల్ ద్వారా (Offline) రిజిస్టర్డ్ మొబైల్ నుండి 9966044425 కి మిస్డ్ కాల్ ఇవ్వండి నెట్ లేకుండా తక్షణమే యాక్టివేట్ చేసుకునేందుకు

1 స్టెప్ 1: పోర్టల్ సందర్శించండి

  1. 1

    వెబ్‌సైట్‌కి వెళ్లండి

    EPFO Member Interface వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
    కుడి వైపున "Important Links" బాక్స్ చూడండి.

  2. 2

    Activate క్లిక్ చేయండి

    అందులో "Activate UAN" అనే లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి.

2 స్టెప్ 2: వివరాలు ఎంటర్ & వెరిఫై

1. ఫారం నింపండి

మీ UAN , ఆధార్ (Member ID అవసరం లేదు), పేరు , పుట్టిన తేదీ , మరియు మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి.
గమనిక: వివరాలు అచ్చం ఆధార్ కార్డులో ఉన్నట్లే ఉండాలి.

2. అనుమతి & OTP

"I hereby consent..." అనే బాక్స్ టిక్ చేయండి. కింద ఉన్న "Get Authorization Pin" బటన్ నొక్కండి.

3. OTP వెరిఫికేషన్

మీ ఆధార్ లింక్ అయిన మొబైల్‌కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి "Validate OTP and Activate UAN" క్లిక్ చేయండి.

🔐 స్టెప్ 3: పాస్‌వర్డ్ జనరేషన్

విజయం! మీ UAN యాక్టివేట్ అయింది.

  • సిస్టమ్ జనరేట్ చేసిన డీఫాల్ట్ పాస్‌వర్డ్ మీ మొబైల్‌కు SMS వస్తుంది.
  • మొదటి సారి లాగిన్ అవ్వడానికి దాన్ని వాడండి.
  • ముఖ్య గమనిక: లాగిన్ అయిన వెంటనే, Account > Change Password కి వెళ్లి మీకు నచ్చిన కొత్త పాస్‌వర్డ్ పెట్టుకోండి.

పాస్‌వర్డ్ నియమాలు:

  • ✓ కనీసం 7 అక్షరాలు, గరిష్టంగా 20.
  • ✓ ఒక పెద్ద అక్షరం (A-Z).
  • ✓ ఒక చిన్న అక్షరం (a-z).
  • ✓ ఒక స్పెషల్ క్యారెక్టర్ (@, #, $, మొదలైనవి).
  • ✓ ఒక అంకె (0-9).
  • ఉదాహరణ: Rahul@1234

పాత మొబైల్ నంబర్ పోతే UAN లాగిన్ అవ్వడం ఎలా? (Troubleshooting Guide)

  • 1️⃣
    స్టెప్ 1:

    మెంబర్ పోర్టల్ లాగిన్ పేజీకి వెళ్లి, Forgot Password పైన క్లిక్ చేయండి.

  • 2️⃣
    స్టెప్ 2:

    మీ UAN మరియు Captcha ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సిస్టమ్ మీ పాత నంబర్ చూపిస్తుంది.

  • 3️⃣
    స్టెప్ 3:

    "Do you have the above mobile number?" అనే ప్రశ్న దగ్గర కచ్చితంగా NO అని ఎంచుకోండి.

  • 4️⃣
    స్టెప్ 4:

    ఇప్పుడు మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్, మరియు ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయండి.

  • 5️⃣
    స్టెప్ 5:

    వెరిఫికేషన్ పూర్తయ్యాక, మీ దగ్గర ఇప్పుడున్న "కొత్త మొబైల్ నంబర్" ఇవ్వండి. ఆ నంబర్‌కు వచ్చే OTP ఎంటర్ చేస్తే, పాత నంబర్ తొలగిపోయి కొత్త నంబర్ మరియు కొత్త పాస్‌వర్డ్ అప్‌డేట్ అవుతాయి.

UAN మరియు PF బ్యాలెన్స్ చెక్ చేసుకునే విధానాలు (యాక్టివేషన్ తర్వాత)

ప్లాట్‌ఫారమ్ (Platform) ఎలా చెక్ చేసుకోవాలి? కావాల్సినవి
UMANG యాప్ యాప్ డౌన్‌లోడ్ చేసి > EPFO ఎంచుకుని > View Passbook క్లిక్ చేయండి UAN మరియు OTP
EPFO పోర్టల్ EPF Passbook పోర్టల్ లో లాగిన్ అవ్వండి UAN మరియు పాస్‌వర్డ్
SMS పద్ధతి EPFOHO UAN అని 7738299899 కి పంపండి UAN తో లింక్ అయిన మొబైల్ నంబర్

ఆఫ్‌లైన్ పద్ధతులు: ఇంటర్నెట్ లేకుండా PF బ్యాలెన్స్ తెలుసుకోండి

EPFO వెబ్‌సైట్ తరచుగా సర్వర్ డౌన్ (Server Down) సమస్యలను ఎదుర్కొంటుంది. అలాంటప్పుడు స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ అవసరం లేకుండా ఈ కింది ఆఫ్‌లైన్ పద్ధతులు మీకు అద్భుతంగా పనికొస్తాయి. (గమనిక: దీనికి మీ UAN యాక్టివేట్ అయి, KYC పూర్తయి ఉండాలి).

పద్ధతి (Method) ఎలా చేయాలి? (Exact Process) ప్రత్యేకత (Benefit)
మిస్డ్ కాల్ సర్వీస్ (Missed Call) మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425 కు మిస్డ్ కాల్ ఇవ్వండి. రెండు రింగ్స్ తర్వాత కాల్ దానంతట అదే కట్ అవుతుంది. ఇది పూర్తిగా ఉచితం. కాల్ కట్ అయిన వెంటనే మీ తాజా బ్యాలెన్స్ వివరాలతో SMS వస్తుంది.
SMS సర్వీస్ (తెలుగులో) మీ ఫోన్ మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి EPFOHO UAN TEL అని టైప్ చేసి 7738299899 కు SMS పంపండి. చివరన 'TEL' అని టైప్ చేయడం వల్ల, మీ PF వివరాలు మీకు తెలుగు భాషలో వస్తాయి. ఇంగ్లీష్ కోసం 'ENG' అని వాడొచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

నా కంపెనీ (Employer) నాకు UAN నంబర్ ఇవ్వకపోతే ఏం చేయాలి?

కొన్ని కంపెనీలు ఉద్యోగులు మానేస్తారేమో అన్న ఉద్దేశ్యంతో UAN వివరాలు దాస్తుంటాయి. మీరు వారిని అడగాల్సిన పనిలేదు. ముందుగా మీ శాలరీ స్లిప్ (Salary slip) పైన చూడండి. అక్కడ కూడా లేకపోతే, EPFO పోర్టల్‌లో "Know Your UAN" ఆప్షన్ ఉపయోగించి మీ ఆధార్ నంబర్ ద్వారా మీరే స్వయంగా మీ UAN ను తెలుసుకోవచ్చు.

కంపెనీ మారినప్పుడు కొత్త UAN క్రియేట్ చేయాలా? (PF Transfer)

అవసరం లేదు. UAN (Universal Account Number) అనేది శాశ్వతమైనది. మీరు ఎన్ని కంపెనీలు మారినా అదే UAN కింద కొత్త PF అకౌంట్లు లింక్ అవుతాయి. మీరు చేయాల్సిందల్లా కొత్త కంపెనీకి పాత UAN ఇవ్వడం మరియు పాత PF బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొత్త అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే.

యాక్టివేట్ చేశాను, కానీ లాగిన్ అవ్వడం లేదు. ఎందుకు?

యాక్టివేషన్ తర్వాత, మీ కొత్త పాస్‌వర్డ్ సిస్టమ్‌లో అప్‌డేట్ అవ్వడానికి సుమారు 6 గంటలు పడుతుంది. దయచేసి 6 గంటల తర్వాత ప్రయత్నించండి.

UAN లో మొబైల్ నంబర్ మార్చడం ఎలా?

మీరు లాగిన్ అవ్వలేకపోతే, నంబర్ మార్చడం కష్టం. ముందుగా మీరు మీ ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోవాలి. ఆధార్ అప్‌డేట్ అయ్యాక, కొత్త నంబర్‌తో UAN యాక్టివేషన్ ప్రయత్నించండి.